రైతంగా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నర్సింహారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: రైతన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పటాన్ చెరు డివిజనల్ అధికారి రమేష్ చంద్రకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతు పటాన్ చెరు విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు మెప్పు కోసమే బిఅర్ఎస్ ఎమ్మెల్యే ల ఆరాటం అన్నారు.బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విసిరిన సవాలు ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్,లక్ష రూపాయల రైతు రుణ మాఫీ.ప్రతి సంవత్స రైతులకు అందిస్తున్న యూరియా, డిఏపి అడుగు మందు వరి,మక్క జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడం వంటివి రైతాంగానికి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలతో పార్టీ తరపున ప్రజా యువత రైతాంగ సమస్యల పై పోరాడుతామన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా మైనార్టీ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు హబిబ్ జాని, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పట్టణ కాంగ్రెస్ కమిటీ ఊపా అధ్యక్షులు మాదస్ శేఖర్,మైనార్టీ సెల్ అధ్యక్షులు మహ్మద్ అక్రం నాయకులు కుంచాలా కిషన్, సంతోష్ కుమార్, ఖదీర్,ఊమ్మర్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *