రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి
బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రేపు 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. సోమవారం విూడియాతో ఆమె మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారని ఆమె చెప్పారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ 4,78,718 మంది, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ 5,02,260 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. పూర్తి స్థాయిలో స్టూడెంట్‌ ఫ్రెండ్లీగా ఏర్పాట్లు జరిగాన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

పరీక్షా కేంద్రాలలోకి మొబైల్‌ అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి చదివారు…విద్యార్థులు మానసిక ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా ఎగ్జామ్‌ రాయాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై రివ్యూ చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు, కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వంద శాతం సిలబస్‌ పూర్తి చేశామన్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు కంటే అందరూ 9 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని..9 తరువాత అనుమతి లేదని తెలిపారు. 475 మంది ఇంటర్‌ పరీక్షల గురించి టెలి మానస్‌కి కాల్స్‌ చేశారన్నారు. ఈసారి కూడా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ టీచర్స్‌ను ఇంటర్‌ బోర్డు పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్నామని శృతి ఓజా వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *