ఆమనగల్లు, ప్రజాతంత్ర, జూలై 23 : కడ్తాల్ మండల పరిధిలోని రేఖ్యతండా లో సర్పంచ్ హరిచంద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ముఖ్య అతితులుగా జడ్పీటీసీ దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనం కుండను నెత్తిన పెట్టుకొని ఊరేగించారు. తాండ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జగన్, వార్డ్ సభ్యులు మొత్య, కృష్ణ, రామనాథ్, శ్రీను, గణేష్, శ్రీనివాస్ తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




