రెస్క్యూ,రిలీఫ్ ఆపరేషన్ లే ప్రధాన  కర్తవ్యం  ..: కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రతీ  పునరావాసనికి స్పెషల్ అధికారుల  నియామకం
వరద  బాధితులకు  కనీస మౌలిక సదుపాయాలు  కల్పించండి
గూగుల్ మీట్ ద్వారా అధికారులకు  పలు  ఆదేశాలు  జారీ  చేసిన  కలెక్టర్

వరద బాధితులను కాపాడి వారికి  పునరావసం కల్పించి… తాగునీరు మెడిసిన్స్, బ్లాంకెట్ తదితర కనీస వసతులను అందించాలని…స్పెషల్ అధికారులకు, వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు  భారీ వర్షాల వల్ల జిల్లా లో నెలకొన్న పరిస్థితులను గూగుల్ మీట్ ద్వారా అదనపు  కలెక్టర్ లతో, RDo లతో, మున్సిపల్ కమిషనర్ లు,DMho, ఇరిగేషన్, తదితర శాఖల  అధికారులతో, తహసీల్దార్ లతో జిల్లా కలెక్టర్ మాట్లాడి పలు వివరాలను  అడిగి తెలుసుకున్నారు.
ముందుగా పునరావాస  కేంద్రాల గురించి మాట్లాడుతూ…. పునరావాస కేంద్రాలలో ఉన్న  వరద  బాధితుల కు  కనీస మౌలిక  సదుపాయల  కల్పన లో ఎలాంటి  లోటు రాకూడదని…. తాగునీరు, మంచి  ఆహరం,మెడిసిన్స్, బ్లాంకెట్ లను  కల్పించాలన్నారు.పొంగి పోర్లే వాగుల ను ముందుగానే గుర్తించి.. అక్కడ ఉండే ప్రజలను  ముందస్తుగా పునరావాస  కేంద్రాలకు తరలించాలన్నారు.19 పునరావాస  కేంద్రాలను ఇప్పటివరకు  ఏర్పాటు చేయడం  జరిగిందని…. ఆయా కేంద్రాలకు స్పెషల్ ఆఫీసర్లను  నియమించాలని  లోకల్ బాడీ అదనపు  కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే కి కలెక్టర్ తెలిపారు.
అవసరమైతే  NCC, NSS వారికి కూడా బాధ్యతలను  అప్పాజెప్పాలన్నారు.క్రిటికల్ ఏరియా ల గురించి అడుగుతు…. Inflow ఎక్కువగా  ఉన్న ప్రాంతాల  వద్ద  ప్రజలను  వెంటనే  పునరావాస  కేంద్రాలకి తరలించాలన్నారు. ఎక్కడైన కోత  కు గురైన  రోడ్ ల వద్ద నిలిచి పోయిన  వాహనాల కు సంబందించి అందులో ఉండే వారికి  కూడా తాగు  నీరు, ఆహరం  మెడిసిన్స్ ఇవ్వాలన్నారు. చెరువుల  inflow ఎక్కువయ్యే  చోట  ముందస్తు గా సంబంధిత  తహసీల్దార్  కు సమాచారం అందించి… పరిసర  ప్రాంతల  ప్రజలను  పునరావాస  కేంద్రాలకు  తరలించాలన్నారు. పునరావాస  కేంద్రాల లో ఉండే వరద బాధితులకు  ఆహారం  అందించుటకు  ముందస్తుగా ఎక్కువగానే  సరుకులు కొనుగోలు చేసి పెట్టుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. Rdo నర్సంపేట కృష్ణవేణి  మాట్లాడుతూ నర్సంపేటలో సిటిజన్ క్లబ్ లో పునరావాస  కేంద్రాన్ని ఏర్పాటు చేశామని … అందులో అన్నీ మౌలిక సదుపాయాలని  కల్పించామని  తెలిపారు. ఎల్గురి రంగంపేట్ చెరువు ఉద్రతి  ఎక్కువ అయినందున  ఆ నీరు  వట్టే వాగు  ద్వారా  ప్రవహిస్తుందని… కావున నెక్కొండ మండలం లోని చుట్టూ
పరిసర ప్రాంతాల అయిన చంద్రు  గొండ, ముది గొండ, బంజేరు పల్లి, కస్నా తండా తదితర ప్రజలను స్థానిక స్కూల్స్ , హాస్టల్స్ కి తరలించామని RDo తెలిపారు. ఇరిగేషన్  కి సంబందించి 850 ట్యాంక్ లకు గాను 812 ట్యాంక్ లు నిండి ఓవర్ ఫ్లో అవుతున్నాయని…నల్లబెల్లి మండలం  లోని దేవత  కుంట  చెరువు  కట్ట తెగిపోయిందని, కళ్ళెడలోని పెద్ద చెరువు,   ఎల్గురి రంగంపేట,   సంగేమ్ లోని అంటుకుంట చెరువులకు  బుంగ  పడిందని …. వెంటనే  మొరం , ఇసుక  బస్తా లతో  తక్షణ చర్యలు  తీసుకున్నమన్నారు. మాదన్నపేట చెరువు  వద్ద ఏళ్ళ  నాటి  ఒక పెద్ద చెట్టు పడి  పోవడం తో  దానిని  కూడా వెంటనే  రెక్టీఫై  చేశామన్నారు.ఎప్పటికప్పుడు  వర్ష  ప్రభావ పరిస్థితులను  update చేయాలని…ఇంకా 48 గంటలు అలెర్ట్ గా ఉండాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *