రెండు లక్షల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడకు చెందిన బాయమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రెండు లక్షల రూపాయల ఎల్ఓసి నీ బాయమ్మ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దయారా సర్పంచ్ భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *