- రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
- రైతు బాంధవులమంటూ కేసీఆర్, కేటీఆర్ మభ్య పెడుతున్నారు
- బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు చెప్పి రైతులకు ఇతర వ్యవసాయ పథకాలు, సబ్సిడీలకు కోత పెట్టిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు, పంట బీమా, కనీస మద్దతు ధరకు బోనస్ అంటూ ప్రగల్బాలు పలికి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీఆర్‌ఎస్ కుటుంబ పాలన, అరాచకాలను ప్రజాకోర్టులో నిలదీస్తే కేటీఆర్ జీర్ణించుకోలేక కుసంస్కారంగా విమర్శలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేటీఆర్…కనీస గౌరవం లేకుండా, కుసంస్కారంగా ప్రధాని మోదీపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాపై.. కేటీఆర్ తన స్థాయి మరిచి మతిభ్రమించినట్లు, ఇష్టానుసారంగా మాట్లాడటడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో మొన్న ప్రధాని మోదీ…ఆ తర్వాత నడ్డా, నిన్న అమిత్ షా బీఆర్‌ఎస్ సర్కార్ బండారాన్ని బయటపెట్టారన్నారు. బీఆర్‌ఎస్ కుటుంబ పాలన, అరాచకాలను ప్రజాకోర్టులో నిలదీస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడని, కాలు కాలిన పిల్లిలా ఆగమాగమై సోయి తప్పి మాట్లాడుతుండని, వణికిపోతున్నడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడని తప్పితే..కేటీఆర్‌కు ఉన్న అర్హత ఏంటని లక్ష్మణ్ ప్రశ్నించారు. పారాచూట్‌లా ఉద్యమంలో దూరి వారసత్వ రాజకీయాలతో ఎదిగిండని, మోదీ, అమిత్ షాలు బూత్ స్థాయి కార్యకర్తలుగా ప్రస్థానం ప్రారంభించారని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజల మెప్పుపొందారని తెలిపారు. బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే..కేసీఆర్, కేటీఆర్ రైతు బాంధవులమంటూ మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.
రైతుబంధు పేరు చెబుతూ వ్యవసాయ పథకాలకు కోత పెట్టారని, ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు, పంట బీమా, కనీస మద్దతు ధరకు బోనస్ అని ప్రగల్భాలు పటుకుతూ…ఒక జేబులో రూపాయి పెట్టి….వెనక జేబుల నుంచి పది రూపాయలు కొట్టేస్తున్నరన్నారు. తెలంగాణలో సర్వత్రా బీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి బస్తా యూరియాకు రూ.2,236 సబ్సిడీ ఇస్తుందని, అలాగే ప్రతి డీఏపీ బస్తాకు రూ. 2,422 సబ్సిడీ ఇస్తుందన్నారు. ఒక ఎకరం పొలంలో ఒక పంటకు రైతుకు 2 బస్తాల యూరియా, 2 బస్తాల డీఏపీ అవసరమని, వీటికి కేంద్రం అందిస్తున్న సబ్సిడీ రూ.9,316 అని, ఏడాది కాలంలో రెండు పంటలకు గాను ఒక్క ఎకరాకు యూరియా, డీఏపీ మీద అందిస్తున్న మొత్తం సబ్సిడీ రూ.18,632 అని, పీఎం కిసాన్ నిధి రూ. 6 వేల చొప్పున ఇస్తున్నదని, మొత్తంగా రైతుకు ఒక ఎకరానికి కేంద్రం మొత్తం రూ.24,632 సాయం అందిస్తున్నదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రైతులను కేంద్రం ఆదుకుంటుంటే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొమ్మొకడిది..సోకొకరిది అన్న మాదిరిగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిదాంట్లో కమీషన్ల కక్కుర్తేనని, కేసీఆర్ తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామన్నారని..ఏమైందని ప్రశ్నించారు. ఏజెన్సీలకు కొమ్ముగాసి నకిలీ విత్తనాలతో రైతుల పొట్టగొడుతున్నారు.
మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పామాయిల్ కోసం అనేక రకాల రాయితీలు కల్పిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ సర్కారు రైతుల నుంచి కమీషన్లు వసూల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. నిన్న తెలంగాణలో పంట నష్టపోయి కౌలు రైతు దంపతులు అశోక్, సంగీత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇది దుస్థితని, రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం, మానవత్వం చూపని దౌర్భాగ్య సర్కారు బీఆర్‌ఎస్ అని లక్ష్మణ్ మండిపడ్డారు. నదులకు నడక నేర్పినం..రైతులను కడుపున పెట్టుకున్నం.. వ్యవసాయంలో నెంబర్ వన్..విప్లవాత్మక సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాటలు చెబుతున్నరని, కానీ దేనికి ఆదర్శమని, నదులకు నడక నేర్పిన సంగతి దేవుడెరుగు…మద్యాన్ని మాత్రం దిల్లీ, పంజాబ్‌లకు ప్రవహింపజేసిన ఖ్యాతి కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 9 లక్షల కోట్లతో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిందని అన్నారు. బీఆర్‌ఎస్ సర్కారు కేంద్రం ఇచ్చే గిరిజన మ్యూజియానికి, సైన్స్ సిటీకి, చర్లపల్లిలో సాటిలైట్ స్టేషన్ కోసం సరిగ్గా భూమిలియ్యలేదన్నారు.
ఉడాన్ పథకంతో విమానాశ్రయాల అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జక్రాన్ పల్లి వంటి ఎయిర్ పోర్టులకు భూమి కేటాయించలేదన్నారు. కేంద్రం దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించింది. ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్లలో 55 లక్షల మందికి ఇండ్లు కట్టించిన ఘనత యోగీ ప్రభుత్వానిదని, తెలంగాణలో మాత్రం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దిక్కులేదన్నారు. రాష్ట్రంలో ఇంటర్, టీఎస్ పీఎస్సీ పరీక్షలను ఒక్కదాన్నీ సక్రమంగా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టారని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దింపారని, తెలంగాణలో ఎన్నికలంటే మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు.
కోట్లకు కోట్లు నోట్ల కట్టలు బయటకు వొస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు కర్రుగాల్చి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను చీల్చేలా కాంగ్రెస్‌ను మోస్తున్నది బీఆర్‌ఎస్ నాయకులేనని, కాంగ్రెస్-బీఆర్‌ఎస్-మజ్లి





