రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కీలక పరిణామం

  • కాంగ్రెస్‌కు సిపిఎం మద్దతు.. అభ్యర్థులు పోటీ నుంచి విరమణ
  • బిజెపిని ఢీకొనేందుకు కలసి పోరాడాలని నిర్ణయం
  • సిఎం రేవంత్‌తో భేటీలో తమ్మినేని చర్చలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించు కుంది. శనివారం సీపీఎం ముఖ్యనేతలతో రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్థానాల్లో మద్దతి వ్వాలని సిపిఎం నేతలను రేవంత్‌ రెడ్డి కోరినట్లు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. అభ్యర్థులను విరమించుకో వాలని సీఎం కోరారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించు కున్నామని.. ముఖ్య మంత్రితో పాటు ఇతర నాయకులతో చర్చించామ న్నారు. ఇక భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామ ని.. బీజేపీ శక్తులను ఓడిరచేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారన్నారు.

దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని రేవంత్‌ గుర్తు చేశారు. ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా…అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వొస్తామన్నారు. సీపీఎం సహకారంతో భవిష్యత్‌లో ముందుకెళతా మని ప్రకటించారు.  ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపునకు పనిచేస్తుం దని భావిస్తున్నానన్నారు. కమ్యూనిస్టుల్లో మరో పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీపీఎం అభ్యర్థుల వల్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరుగుతుందన్న భావనతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీతో కలసి పని చేస్తున్న కమ్యూనిస్టులతో మాట్లాడాలని నిర్ణయించుకన్నారు. అందుకే తమ్మినేని వీరభద్రంను సిఎం రేవంత్‌ చర్చలకు ఆహ్వానించి నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కొంత వోటు  బ్యాంక్‌ ఉన్న సీపీఎం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి కొంత మేర వోట్లు కలిసి వొచ్చే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *