మహబూబ్ నగర్, ప్రజాతంత్ర: ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత రేపు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న యాత్ర కృష్ణా మండలం బ్రిడ్జి నుంచి థై రోడ్ వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది. దీపావళి పండుగ 3 రోజుల విరామం తరువాత యాత్ర మళ్లీ అక్కడి నుంచే రేపు ప్రారంభం కానుంది. ఉదయం 7.30 ల నుంచి పది గంటల వరకు రాహుల్ గాంధీ పాద యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం విరామం తరువాత సా.4 గం. యాత్ర తిరిగి కొనసాగనుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు దీపావళి పండుగను క్యాంప్‌లోనే ఉత్సాహంగా జరుపుకున్నారు.




