షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్ మండలం మధులపూర్ గ్రామ సర్పంచ్ శివారెడ్డి ఆధ్వర్యంలో మంగలి గుట్ట తాండ నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి గారు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనే ప్రజలు గుర్తించుకోవాలి



