రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : తెలంగాణలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి.  31 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ ‌జనరల్‌గా శశాంక్‌ ‌గోయల్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను, ఆర్కియాలజీ డైరెక్టర్‌, ‌క్రీడాపాధికార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అలాగే..ఆయుష్‌ ‌డైరెక్టర్‌గా హరిచందన, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా అలగు వర్షిణి, క్రీడల సంచాలకులుగా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ ‌కంట్రోల్‌ ‌సొసైటీ డైరెక్టర్‌గా హైమావతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శిగా కె.హరిత, పర్యాటకశాఖ సంచాలకులుగా కె.నిఖిల, వ్యవసాయ శాఖ ఉపకార్యదర్శిగా సత్యశారదాదేవి, భదాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాం ఆల, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్యను నియమించారు. పెద్దపల్లి కలెక్టర్‌గా ముజమిల్‌ ‌ఖాన్‌, ‌టీఎస్‌ ‌ఫుడ్స్ ఎం‌డీగా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్‌ ‌జైన్‌, అలాగే సెర్ప్ ‌సీఈవోగా పి గౌతం, హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి, జీహెచ్‌ఎం‌సీ అదనపు కమిషనర్‌గా ఎస్‌ ‌స్నేహ, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్‌ ‌నికోలస్‌, ‌నిజామాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌గా మంద మకరందును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *