రాష్ట్రంలో 13,657 ఎకరాలలో 19,472 పల్లె ప్రకృతి వనాలు

గ్రామీణ ప్రాంతాలలో రూ.67.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు
మండలానికి 5 చొప్పున 545 మండలాలలో 2,725 బృహత్‌ ‌వనాలు లక్ష్యంగా 1,478 పూర్తి
వివిధ దశలలో మిగతా పనులు

పల్లె ప్రగతిలో నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లు విరియాలనే లక్ష్యంగా రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలను, బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలలో 67 కోట్ల 45 లక్షల రూపాయలు వ్యయంలో 13,637 ఎకరాలలో విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పల్లె ప్రకృతి వనాలలో ఓపెన్‌ ‌జిమ్‌లు, వాకింగ్‌ ‌ట్రాక్‌లు, పిల్లల కోసం అట స్థలాలు, పెద్దల సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

పల్లె ప్రకృతి వనాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.  అందులో భాగంగా 2,725 బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఒక్కొక్క బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాన్ని 5 నుండి 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ఇప్పటివరకు 2,339 స్థలాలను గుర్తించారు. వీటిలో 1,849 స్థలాలలో పనులు ప్రారంభించగా, 1,478 బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయి. ఇంకను 386 బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. త్వరలోనే స్థలాలను గుర్తింపు బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయడానికి పంచాయతీ రాజ్‌ ‌కార్యచరణ ప్రణాళిక రూపొందించింది.

 

పట్టణ ప్రాంతాల తరహాలో గ్రామాలల్లో కూడా పార్కులు, వాకింగ్‌ ‌ట్రాక్‌ ఉం‌డాలని లక్ష్యంతో అడవిని తలపించేలా బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలల్లో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటుతున్నారు. ప్రతి మండలానికి సగటున ఐదు చొప్పున ఏర్పాటు చేయబడుతున్నాయి.  అందుకోసం దాదాపుగా 300 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేయబడింది. గ్రామీణ విద్యార్థులు, యువత, యువకులు, వృద్ధులు సేదతీరటానికి, కాలక్షేపంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా వ్యాయయం కోసం జిమ్స్ ఏర్పాటు చేయబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *