- రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల
- పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను
- నియమించిన జాతీయ నాయకత్వం
న్యూ దిల్లీ, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని నియమిస్తూ బిజెపి జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త అధ్యక్షుడి నియామకం తక్షణం అమలులోకి వొచ్చినట్లు ఉత్తర్వులలో పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా్వ రలో ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొత్త అధ్యక్షులను నియమించింది.
పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా అధ్యక్షులను మార్చింది. మరోవైపు.. తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను పార్టీ నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సం జయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కాగా ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు జాతీయ స్థాయిలో పదవి్వ నున్నట్లు సమాచారం.




