రామ్‌లీలాలలో కిసాన్‌ ‌గర్జన

పెట్టుబడి సాయం రూ.12 వేలకు పెంచాలని డిమాండ్‌
‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌భారతీయ కిసాన్‌ ‌సంగ్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని రామ్‌ ‌లీలా మైదానంలో కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలపై వారం రోజులపాటు పార్లమెంట్‌ ‌లో చర్చ జరపాలంటూ డిమాండ్‌ ‌చేశారు.

వ్యవసాయ పనిముట్లపై జీఎస్టి ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయల పెట్టుబడి సాయం 12వేలకు పెంచాలంటున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురావాలని..రైతు ఉత్పత్తులపై లాభసాటి ధర ఇవ్వాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *