- పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ
- వారి కష్టాలను తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర
- హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి
- పాదయాత్రకు విశేష స్పందన
మణుగూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వొస్తుందని, ప్రజలు అధైర్యపడవొద్దని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు ఒకోక్కక్కరికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా రైతులకు రూ.2 ఓల వరకు ఋణమాపీ చేస్తామన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సోమవారం నిర్వహించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర భదాద్రి కొత్తగూడె జిల్లాలో కొనసాగింది. యాత్రలో భాగంగా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఏర్పాటు చేపిన శిబిరం నుండి పాదయాత్రను ప్రారంభించి చింతిర్యాల క్రాస్‌రోడ్ అశ్వాపురం, మంచికంటినగర్, జగ్గారం, మిట్టగూడెం, కల్యాణపురం గ్రామాల మీదుగా తోగ్గూడెం వరకు కొనసాగింది. ఈ పాదయాత్రకు వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఈ పాదయాత్రలో ముఖ్యంగా మహిళలు, రేవంత్‌రెడ్డితో, ములుగు శాసన సభ్యురాలు దనసరి సీతక్కతో ముచ్చటిస్తూ అడుగులో అడుగు వేశారు. పాదయాత్రను కొనసాగిస్తూనే పలువురి ఇండ్లకు వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగ్గారం గ్రామంలో వంకాయల తిరుపతయ్య అనే దళితుని పూరిగుడిసెను చూసి చలించిపోయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం వలన ప్రజకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చిన పేదలు పూరిగుడిసెల్లో ఉన్న వారిని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ప్రతికుటుంబం ఆర్దికంగా స్థిరపడేందుకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మీరు కూడా కాంగ్రెస్‌కు అండగా ఉండాలన్నారు. అనంతరం పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కార్మికులతొ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు చిరు వ్యాపారస్తుతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వొస్తే ప్రజల సమస్యలను తీరుస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన ఎమ్మేల్యేలు ప్రజలకు చేసిన న్యాయం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన కేసిఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. కేజి టు పిజి ఉచిత విద్యను అందిస్తానన్న కేసిఆర్ విద్యార్దులకు కనీసం రియిమెంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీనితో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాం రెట్టింపయిందన్నారు. ఈ పాదయాత్రలో డిసిసి అధ్యక్షులు పోదెం.వీరయ్య, డాక్టర్మల్లు రవి, చందా లింగయ్యదొర, సాయిని వెంకటేశ్వరరావు, చందా సంతోష్, బట్టా విజయ్‌గాంధీ, చకాటబొయినా నాగేశ్వరరావు, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి భిక్షమయ్య, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, యువత, ప్రజలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




