హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరాసనగా బాబు సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుంటూ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం అధ్వర్యంలో సమర్పించినట్లు పేర్కొన్నారు. నిర్దోషి అయిన 73 సంవత్సరాల బాబును జైల్లో నిర్బందించి ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మారమోని శైలం యాదవ్, శ్రీషా, అర్జున్, గోపాలకృష్ణ చౌదరి, గౌరి శంకర్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం




