రాజేంద్రనగర్ లో.. 50 వేల మెజారిటీతో గెలుపు తత్యంనామినేషన్ లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్ , ప్రజాతంత్ర , నవంబర్ 9 :  రాజేంద్రనగర్ లో బీజేపీ 50 వేల మెజారిటీతో గెలుపు తత్యమని నియోజకవర్గం అభ్యర్థి తోకలా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మైలార్ దేవ్ పల్లి హనుమాన్ దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా నామినేషన్ వేయడానికి బయలుదేరి వెళ్లారు. రాజేంద్రనగర్ ఆర్డీవో రిటర్నింగ్ కార్యాలయం వరకు మహిళాలతో భారి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు బీఅర్ఎస్ పార్టీ ప్రజలను ఏవిధంగా మోసం చేస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారనీ, బీఅర్ఎస్ పార్టీ ప్రజలను మాటలతో మభ్యపెడుతుందని ప్రజలకు అవగాహన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రజల కష్టలో  ఉన్నప్పుడు ఉచిత రేషన్ బియ్యం కరోనా వ్యాక్సిన్స్ వంటివి అందిస్తూ వచ్చారన్నారు. ఆయుష్మాన్ భవ పేరుతో ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు కల్పిస్తున్నారన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. నాకు అవకాశం ఇచ్చిన జాతీయ పార్టీ నాయకులకు, వేలాది మంది నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు నామినేషన్ కు తండోపతండాలుగా వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీయే చిహ్నమని, రాజేంద్రనగర్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జెండా పాత బోతున్నామని 50 వేల మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్య్రమానికి కేంద్ర కమ్యునికేషన్ మంత్రివర్యులు దేవు చౌహాన్, రాష్త్ర, జిల్లా, మండల, మున్సిపాలిటీ, డివిజన్, నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *