మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 14: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కుమార్ లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి శాసన సభ్యులు రాజాసింగ్, పి.హరిష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే, బిజెపి శ్రేణులను ప్రాణంతో సమానముగా చూసుకుంటామని చెప్పారు. శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మూడవ సారి బీజేపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
రాజాసింగ్ కు శంకర్ రెడ్డి సన్మానం





