రాజకీయ పార్టీలు…. అనుబంధ సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30‌న జరిగే ఎన్నికలకు గాను ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు 119 అభ్యర్థుల ఎంపికల కోసం నిమగ్నమై ఉన్నారు. రాజకీయ పార్టీలతో పాటుగా వాటి అనుబంధ సంఘాలకు బాధ్యతలను అప్పజెప్పడంలో  డైనమిక్‌, ‌సీనియర్‌ ‌లీడర్‌, ‌మాట్లాడే వారిని, జన ఆకర్షణ ప్రజలతో మమేకమైన కార్యకర్తలు, అభిమానులు, నాయకుల వేటలో  రాజకీయ పార్టీలు ఓట్లు రాబట్టటానికి ప్రయత్నిస్తున్నాయి.

అనుబంధ సంఘాలలో ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్‌, ‌రైతు సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాల నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తమ సేవలను వినియోగించుకోవడం కోసం రాజకీయ పార్టీలు అన్వేషణ చేస్తున్నాయి. వారి ప్రచారం కోసం మండలాలను, గ్రామాలను గుర్తించడం జరిగింది. వారికి కావలసిన రవాణా, రోజువారి ఖర్చులను కూడా సమకూర్తున్నాయి.స్థానిక ఎన్నికల  తరహాలో ప్రతి  ఓటరు మహాశయులను కలసి ఓట్లు అడిగే పనులనుఅప్పగించడం జరుగుతుంది.  ఎన్నికల కోసం 50రోజుల ప్రణాళిక సిద్ధం కావడం జరుగుతుంది.

ఒక చెట్టుకు కొమ్మలు
ఎంత అందమో, రాజకీయ పార్టీలకు కూడా అనుబంధ సంఘాలు కూడా అంతేఅందం. అవసరము కూడ. ఎన్నికలు అనగానే ప్రతి కార్యకర్తకు ఎన్నికల పనులు బాధ్యతలు చేపట్టి  ఫలితాలను అధిష్టానానికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.
– ఈదునూరి మహేష్‌
9949134467

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *