రాజకీయ జ్ఞానం లేకుండా మాట్లాడుతారా..

కెటిఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం
కరీంనగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌14 : కేటీఆర్‌కు రాజకీయ జ్ఞానం లేదని, వారి హయాంలో ఇచ్చిన హావిూలపై చర్చకు సిద్ధమా..అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బిఆర్‌ఎస్‌ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మంత్రి విూడియాతో మాట్లాడుతూ..  సుధీర్‌ రెడ్డికి ఉన్న బుద్ధి కూడా నీకు లేదా…కడియంతో విూరే మాట్లాడిర చారా…అంటూ మండిపడ్డారు.

దాళ్లు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని పొన్నం ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి హయాంలో జరిగిన రెండు శాఖల లెక్కలే కళ్ళు తిరుగుతున్నాయన్నారు. కవితను జైలుకు పంపుతా అన్న బండి సంజయ్‌ పరిస్థితి ఏందంటూ ఆయన ప్రశ్నించారు. తమను జైలుకు ఎందుకు పంపలేదని, దమ్ములేదా అంటూ హరీష్‌ రావు.. వ్యాఖ్యలు చేశారన్నారు. ఇక ఆటో డ్రైవర్ల సమస్యపై సవిూక్ష చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *