- దీనికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
- హోంగార్డు వ్యవస్థలో నిత్య బానిసత్వం
- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, •కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ఎన్నికల పోరాటనికి సిద్ధంగా ఉండాలని బిజెపి రాష్ట్ర చీఫ్ పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : హోంగార్డు రవీందర్ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రభుత్వ హత్య అన్నారు. జీతాలు చెల్లించకుండా వేధించడం దారుణమన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతోందని.. ప్రతికూల పరిస్థితుల్లో వారు విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడిం చారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాల న్నారు. బందోబస్తు సమయాల్లో ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని కోరారు. హోంగార్డుల హక్కుల సాధన కోసం తాను ముందుంటా నని హావి• ఇచ్చారు. గతంలో శాసనసభలో తాను ప్రశ్నిస్తే.. హోంగార్డులకు ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
అలా చెప్పి ఐదున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదన్నారు. రవీందర్ ప్రాణాలు కాపాడాలని అందుకు నేను కృషి చేస్తానని చెప్పారు. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హోంగార్డు కుటుంబ సభ్యులు జీతాలు లేక రోడ్డున పడుతున్నారు. హోంగార్డులు 16 గంటలు పనిచేస్తున్నారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడి జరుగుతోంది. హోంగార్డులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హావి•లను నెరవేర్చాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో హోంగార్డులు పనిచేస్తున్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోంది. పోలీస్ వ్యవస్థలో సైతం హోంగార్డులకు అవమానం జరుగుతోందని పేర్కొన్నారు.
ఎన్నికల పోరాటనికి బిజెపి శ్రేణులు సిద్దంగా ఉండాలి : కిషన్ రెడ్డి పిలుపు
కేంద్ర నిధుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వి•డియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ళ కాలంలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల హావి•లను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అంటూ విరుచుకుపడ్డారు.
సెప్టెంబర్ 17ను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రం నిర్వహిస్తుందన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా.. సెప్టెంబర్ 17నుంచి అక్టోబర్ 2వరకు సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. వివిధ రూపాల్లో 27 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. డబుల్ బెడ్రూం, పెన్షన్లపై కేసీఆర్ ఇచ్చిన మాట మాట తప్పారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.




