చెలరేగే కోర్కెల గుర్రాల జోరులో,
విషవలయాల్లోకి లాగే స్వార్ధశక్తుల
పరిచయంతో
కన్నపేగుని ఏమారుస్తూ,
అత్యాశల మరీచికల వెంబడి
ప్రయాణిస్తూ,
నిరంతర చీకటిని వాటేసుకుంటోన్న
ఓ యువతా!
నీ మనసుకు
కాస్త విచక్షణా కళ్లెం వేయి.
గాయపడిన మనసు తెరపై
ఏర్పడిన
రుధిర మరకల్నే చూసుకుంటూ
నెరవేరని సదాశల పందిరికింద
చతికిలబడక
నీలో చేతనత్వాన్ని కాస్తంత నిద్ర లేపు.
వీగిపోయిన తపనల తపస్సుని
పునరుజ్జీవింప చేయుటకై
సుష్కించిన ఆశయ కాసారాన్ని
నీ కోర్కెల సాధుజలంతో నింపటానికి
అడ్డొచ్చిన ముళ్ళకంచెలను
తొలగించుకుంటూ,
ఎదురొచ్చిన
రాళ్లపై నుండి దుముకుతూ,
నీ గమ్యపు సౌందర్యాన్ని
ఊహించుకుంటూ
క్షణమాగని దినకర గతిలో
సాగిపో ముందుకు…మున్ముందుకు.
– వేమూరి శ్రీనివాస్‌,  9912128967,  తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *