యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ విసిలు

  • పది యూనివర్సీటీల బాధ్యతలు ఐఎఎస్‌లకు.. ఉస్మానియాకు దాన కిశోర్‌..జెఎన్టీయూకు బుర్రా వెంకటేశం
  • తెలుగు వర్సిటీ విసిగా శైలజా రామయ్యర్‌ల నియామకం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల పదవీకాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్‌ విసిలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్‌ వీసీలను నియమించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఇంఛార్జ్‌ వీసీలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా దాన కిషోర్‌ నియమితులయ్యారు.

జేఎన్టీయూ ఇంఛార్జ్‌ వీసీగా బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా కరుణ వాకాటి,తెలంగాణ యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా సందీప్‌ సుల్తానియా, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా రిజ్వి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా  శైలజ రామయ్యర్‌, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా నవీన్‌ మిట్టల్‌, శాతవాహన యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా సురేంద్రమోహన్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనాన్స్‌ యూనివర్సిటీ  జయేష్‌ రంజన్‌, పాలమూరు యూనివర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా నదీం అహ్మద్‌లను ప్రబుత్వం నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *