బీహార్, జూలై 22 : సంగీత పాఠాలు నేర్పించాల్సిన ఓ మాష్టారు తప్పుడు రాగం పాడాడు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుకి బుద్ధి చెప్పారు. అంతటితో ఆగకుండా.. మాష్టారుతో పాటుయువతి పట్ల కూడావాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు గుడ్డలు తీసి, దేహశుద్ధి చేశారు. ఆపై వీడియో తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది బీహార్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. బెగుసరై పత్‌కౌలా గ్రామం కిషన్ దేవ్ చౌరాసియా(45) ఒక మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అతడు ఓ యువతికి (20)కి మ్యూజిక్ పాఠాలు నేర్పిస్తున్నాడు. అయితే.. దుర్బుద్ధి గల ఆ మాష్టారు, ఆ యువతిపై కన్నేశాడు. తన కూతురి వయసున్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుపై దాడి చేశారు. అంతేకాదు.. ఆ యువతితో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరి బట్టలు ఊడదీసి కొట్టారు. అంతటితో ఆగకుండా.. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.



