యాంటీబయాటిక్స్ అతి వాడకంతో ఆరోగ్య సంక్షోభం

‘‘‌వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటంపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు, వైద్య సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.’’

బ్యాక్టీరియా, వైరస్‌ ‌వంటివి యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని నిలబడుతున్న తీరు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సంక్షోభానికి దారి తీయనున్నాయి. యాంటీబయాటిక్స్ అనేవి శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదిగా నాశనం చేసే మందులు. జలుబు, ఫ్లూ, దగ్గు వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లకు ఈ యాంటీబయాటిక్స్ ‌పని చేయవు. బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే జ్వరం, న్యుమోనియా వంటి జబ్బులకు ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి.రోగనిరోధక శక్తి తగ్గుదల  వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటంపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు, వైద్య సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మొండిగా తయారవుతున్న బ్యాక్టీరియా, వైరస్‌లు బాక్టీరియాలు, వైరస్‌  ‌లు మరింత మొండిగా తయారై, యాంటీబయోటిక్స్‌కు లొంగని స్థాయికి చేరుకుంటున్నాయి. మున్ముందు  ప్రపంచ జనాభా అంతా ప్రమాదంలో పడుతుందన్న భయాందోళనలున్నాయి. ఇప్పుడు అదే దిశగా ప్రపంచం పయనిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‌విడుదల చేసిన ఓ నివేదిక చెబుతోంది.
గ్లాస్‌ ‌సర్వే బాక్టీరియా, వాటి ప్రవర్తనల గురించి 127 దేశాల్లో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, ‘గ్లోబల్‌ ‌యాంటీమైక్రోబియల్‌ ‌రెసిస్టెన్స్ అం‌డ్‌ ‌యూజ్‌ ‌సర్వేలెన్స్ ‌సిస్టమ్‌(‌గ్లాస్‌)’ ‌పేరిట డబ్ల్యూహెచ్‌ఓ  ‌నివేదికను తయారుచేసింది.వైద్యులు సూచించిన అన్ని యాంటీ బయాటిక్స్ ‌లో 50 శాతానికి పైగా అవసరం లేనివే ఎక్కువగా ఉంటాయని అవి అంతగా ప్రభావితం చేయవని  పరిశోధన నివేదిక వెల్లడించింది.యాంటీ బయాటిక్‌ ‌రెసిస్టెంట్‌ ఇన్ఫెక్షన్స్ ‌కారణంగా ప్రతి సంవత్సరం 23 వేల మంది మరణిస్తున్నారని యూఎస్‌ ‌కి చెందిన నివేదిక  పేర్కొంది.

సూక్ష్మక్రిముల్లో యాంటీబ యోటిక్‌ ‌నిరోధకత
సూక్ష్మక్రిముల్లో యాంటీ బయోటిక్‌ ‌నిరోధకత అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. లాన్సెట్‌ ‌సంస్థ అధ్యయనం ప్రకారం.. 2019లో 12.70 లక్షలమంది యాంటీబయోటిక్స్ ‌విఫలం కావడం వలన చనిపోవడం గమనార్హం.
ఔషధాల విక్రయం, వినియోగంపై లేని నిఘా మనదేశంలో ఔషధాల విక్రయం, వినియోగంపై అమెరికా, యూరప్‌లో ఉన్నట్టు ఇప్పటికీ ఒక సరైన నిఘా విధానం లేదు. దేశంలో యాంటీబయాటిక్స్ ‌విచక్షణారహితంగా వాడుతున్నారు. డాక్టర్‌ ‌ప్రిస్కిప్షన్‌ ‌లేకున్నా ఈ ఔషధాలు తేలికగానే దొరుకుతాయి. గుర్తింపు పొందిన డాక్టర్లు కూడా రోగులకు వీటినే ఎక్కువగా రాస్తున్నారు.
వద్దన్నా వాడుతున్నారు  భారతీయులు వాడుతున్న యాంటీబయాటిక్స్‌లో 72 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ వాడొద్దని చెప్పినవే. కరోనా మొదలైన తర్వాతే కాదు, అంతకు ముందు కూడా దేశంలో యాంటీబయాటిక్స్ ‌వాడకం అధికంగానే ఉంది. కోవిడ్‌ ‌తర్వాత ప్రతి ఇంట్లో పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌ ‌వంటి టాబ్లెట్స్ ‌వాడకం పెరిగింది.

సూచించిన అన్ని యాంటీ బయాటిక్స్ ‌లో 50 శాతానికి పైగా అవసరం లేనివే ఎక్కువగా ఉంటాయని అవి అంతగా ప్రభావితం చేయవని ఓ పరిశోధన నివేదిక వెల్లడించింది.యాంటీబయాటిక్స్‌లో 90 శాతం ప్రైవేటు ఆస్పత్రులు సిఫార్సు చేసినవే అమెరికాకు చెందిన బోస్టన్‌ ‌యూనివర్సిటీ, ఢిల్లీకి చెందిన పబ్లిక్‌ ‌హెల్త్ ‌ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా కలిసి మనదేశంలో యాంటీబయాటిక్‌ ‌మందుల వాడకంపై ఓ సర్వే నిర్వహించాయి. వినియోగించిన మొత్తం యాంటీబయాటిక్స్‌లో 90 శాతం ప్రైవేటు ఆస్పత్రులు, డాక్టర్లు సిఫారసు చేయగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చినవి 10 శాతమే. 2019లో పెద్దలు వాడిన ఔషధాల్లో మొత్తం డిఫైన్డ్ ‌డైలీ డోసేజ్‌ 5,071 ‌మిలియన్లు. అంటే ప్రతి వెయ్యిమంది పెద్దల్లో రోజూ 10.4 డోసేజీ వాడారన్నమాట. జాతీయ జాబితాలో చేర్చిన మొత్తం ఫార్ములేషన్స్‌లో అత్యవసర ఔషధాలు 49 శాతం ఉండగా, ఫిక్స్‌డ్‌ ‌డోసేజ్‌ ‌కాంబినేషన్స్ ‌వాటా 34 శాతం ఉంది. జాబితాలోని మొత్తం ఔషధాల్లో సెంట్రల్‌ ‌డ్రగ్స్ ‌స్టాండర్డ్ ‌కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ‌గుర్తింపు పొందినవి కేవలం 47.1 శాతమే.అతి వాడకం అనర్థదాయకం ఔషధాలను అతిగా వాడుతుండటంతో రానురాను అవి పనిచేయకుండా పోతున్నందున అవసరం మేరకు, నిపుణులైన డాక్టర్‌ ‌ల పర్యవేక్షణ లో మాత్రమే వాడాలి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతీ వ్యక్తి జాగరూకత తో ఉండాలి.

– పిన్నింటి బాలాజీరావు హనుమకొండ.
9866776286 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *