మళ్ళీ గెలిస్తే పటాన్ చెరు వరకు మెట్రో రైలు
మేము మాట తప్పము..చెప్పింది చేస్తాం
ఇంటింటికి మంచి నీళ్ళు, 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం
పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు…55 గ్రామ పంచాయితీలకు 15 లక్షల చొప్పున నిధులు
పటాన్ చెరుకు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు…రెవెన్యూ డివిజన్ చేస్తాం.
బహిరంగ సభలో నియోజక వర్గానికి సీఎం వరాల జల్లు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మరోసారి దీవించాలని ప్రజలకు వినతి
కొండకల్లో మేథా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సిఎం కెసిఆర్
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 22 : వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు వొచ్చాక వైద్య రంగం పరుగులు పెడుతుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. గురువారం పటాన్చెరులో రూ.183 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని హాస్పిటల్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాగ్లాడుతూ.. ఇంతకు ముందు హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తప్ప వేరే హాస్పిళుల్ల లేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదన్నారు. అన్ని విధాలా ఇదే పరిస్థితి కొనసాగాలంటే మళ్ళీ మన ప్రభుత్వమే రావాలనాన్నరు. అలా కాకుండా మోసపోతే గోసపడతామని సిఎం అన్నారు. మరో సారీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే, ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే ఏకైక రాష్టం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ చిమ్మని చీకటవుంతుందని..కరెంట్ రానే రాదని తెలంగాణ రాక ముందు ఎన్నో అపోహలు, అనుమానాలు కల్గించారన్నారు. 
కాని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అవరసరాలకు 24 గంటల కరెంట్ ఉంటుందన్నారు. వ్యవసాయానికి కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. ఎందుకు కొరగాకుండా పోతారని ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించి.. 3.17 లక్షలతో పర్ క్యాపిటా ఇన్ కంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుందన్నారు కేసీఆర్. ఇక మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే వొచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రో రైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా కేసీఆర్ వాగ్ధానం చేశారు. తమ ప్రభుత్వానికి మళ్లీ అధికారమిస్తే అత్యధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతం పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలును విస్తరిస్తామని తెలిపారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కునొక్కువచ్చు అనే పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు పరిస్థితి తారు మారు అయ్యిందని, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 50 ఎకరాలు కొనుక్కోవొచ్చని, ఆ విషయాన్ని చంత్రబాబు నాయుడే చెప్పాడని అన్నారు. అంతలా రాష్ట్రం అభివృద్ధి అయ్యిందన్నారు. తాము చెప్పింది చేస్తామని, మాట తప్పమన్నారు.
పటాన్‌చెరుకు సిఎం వరాల జల్లు
ఇక పటాన్ చెరు నియోజక వర్గానికి సిఎం వరాల జల్లు కురిపించారు. నియోజక వర్గంలోని మూడు మున్సిపాలిటీ లకు 30 కోట్ల చొప్పున, 55 గ్రామ పంచాయితీలకు సిఎం నిధి నుంచి 15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. స్థానిక ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి కోరిక మేరకు పటాన్ చెరును రెవెన్యూ డివిజన్ చేస్తామని, పటాన్ చెరులో పాలిటెక్నిక్ కాలేజ్‌ను మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఇక మంత్రి కెటిఆర్‌తో మాట్లాడి పటాన్ చెరు ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తమని సిఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మనం కడుతున్న డబుల్ బెడ్ రూమ్‌లు దేశంలో ఎక్కడా లేవన్నారు. మరో సారి మహిపాల్ రెడ్డిని దీవించండని ప్రజలను కోరారు. గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్ నగర్‌కు మెట్రో మంజూరు చేస్తామన్నారు. ఇక తాను మంత్రిగా ఉన్నప్పుడు పటాన్ చెరుతో ఉన్న అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. అయితే మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్ చెరు దూసుకెళుతుందన్నారు. మహిపాల్ రెడ్డి పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కావాలన్నారని..ఈ రోజే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తామన్నారు. కేసీఆర్. త్వరలోనే పటాన్ చెరు దగ్గర ఐటీ కంపెనీలు వొచ్చేలా చేస్తామన్నారు. ‘కేసీఆర్ నగర్’ టౌన్ షిప్లో 2 వేల ఇళ్లు పటాన్ చెరుకు కేటాయిస్తామన్నారు సీఎం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ….పటాన్ చెరు ప్రజలకు శుభ దినం. పటాన్ చెరు పట్టణంలో 200 పడకల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేసిన సీఎం కేసిఆర్ కి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సుల్తానా పూర్లో మెడికల్ డివైస్ పార్క్ లో పొల్యూషన్ లేని పరిశ్రమల ఏర్పాటుతో సుమారు పదిహేను వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారనీ తెలిపారు. హైట్ హబ్ కోసం సుమారు 500 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకున్నారు. పటాన్ చెరు ప్రజల చిరకాల కళ నెరవేరిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని జ్ఞాపికతో, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మాజీ ప్రధాన కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ రాజీవ్ శర్మ, టీఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే కాంతి కిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ బీపీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు,జెడ్పిటిసిలు, ఎంపీపీలు, నియోజకవర్గం సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొండకల్లో మేథా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సిఎం కెసిఆర్
రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సిఎం కెసిఆర్ గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్‌ను తీసుకువచ్చామన్నారు. తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసే అద్భుతమైన ప్రాజెక్టును 2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తి చేసి నాతోప్రారంభింపజేసుకున్నారన్నరు . కేసీఆర్ హైదరాబాద్‌లో ఫార్మా, ఫౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగిందన్నారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి దాదాపు మూడింట ఒకటో వంతు ప్రపంచానికి సరఫరా చేస్తున్నామన్నారు. ఇక టీ ఐపాస్ తీసుకొచ్చినప్పుడు తాను శ్రమపడ్డానని.. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో బిజినెస్ మీటింగ్ లో పాల్గొన్న సందర్భంలో చాలా గర్వంగా చెప్పేవాడినన్నారు. ప్రపంచంలో భారతదేశంతో పాటు చాలా చోట్ల సింగిల్ విండోలున్నాయన్నారు.రియల్ సింగిల్ విండో విధానంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. ఫార్స్, బోగస్ ఎంఓయూలు కాకుండా రియల్ స్పిరిట్ లో చేస్తున్నామన్నారు. ఏ ఆఫీసర్ టేబుల్ పై ఫైల్ ఆగినా రోజుకు వెయ్యి రూపాయల జరిమానా విధించేలా రూల్స్ పెట్టామన్నారు. ఇలాంటి చర్యలతోనే పారిశ్రామిక ప్రగతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతుందన్నారు.24 గంటలు ఏ సమస్య వచ్చినా పరిష్కారించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక మేథా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.
రంగారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సిఎం కెసిఆర్ గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్‌ను తీసుకువచ్చామన్నారు. తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసే అద్భుతమైన ప్రాజెక్టును 2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తి చేసి నాతోప్రారంభింపజేసుకున్నారన్నరు