మోడల్ స్కూల్స్ విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లను అందజేసిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మోడల్ స్కూల్స్ విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అందజేశారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం టీఎస్ మోడల్ స్కూల్ కందుకూరు మండలం నేదునూర్ టీఎస్ మోడల్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న 2వందల మంది విధ్యార్థులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.విద్యా పరిజ్ఞానాన్ని ధనాత్మక తీర్పును,జ్ఞానాన్ని ఇవ్వటం విద్య యొక్క  ప్రాథమిక ఉద్దేశమని అన్నారు.ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందని,మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు.ముఖ్యంగా మాట తీరు,నడవడిక,వేషధారణను సైతం మార్చేస్తుందని పేర్కొన్నారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు,గౌరవం కేవలం విద్య వల్లనే దక్కుతుందన్నారు.ప్రతి సంవత్సరం విద్యార్థులకు,పాఠశాలకు తన వంతు సహకారం తప్పక అందిస్తానన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమానికి కృషిచేసిన డిపో మేనేజర్ మనోహర్ రెడ్డి,మహేశ్వరం మోడల్ స్కూల్ హెచ్ఎం ధనుంజయ, నేదునూర్ మోడల్ స్కూల్ హెచ్ ఏం.శ్రీధర్,కృష్ణ గౌడ్,కుమార్ గౌడ్,షరీఫ్ ఖాన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణా నాయక్,వైస్ ఎంపిపి శమంతా ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల యాదయ్య,  మహేశ్వరం మండల మహిళా అధ్యక్షురాలు ఆయిళ్ల కమలమ్మ,మహేశ్వరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,అల్లే కుమార్,జిల్లా మైనార్టీ జనరల్ సెక్రెటరీ  అఫ్జల్ బేగ్, కందుకూరు మండల మాజీ యూత్ కాంగ్రెస్ నాయకులు సిగిరిపురం మాజీ ఎంపిటిసి కొమురయ్య,గంగారాం మాజీ ఎంపిటిసి దశ్రు నాయక్,కల్వకోల్ మాజీ సర్పంచ్, తిరుమల పోచయ్య,బొజ్జం కిష్టయ్య,అల్లే బిక్షపతి,జి జంగయ్య,ఒత్తుల నారాయణ, అల్లే రాకేష్,చాకలి,బాలయ్య,గాజుల ఆనంద్,  మహేశ్వరం నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర చంద్రమోహన్,మంద,రాజు కల్వకోలు గ్రామ శాఖ అధ్యక్షులు సుధాకర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆశ పల్లి బాలరాజ్,ఎన్ఎస్ యుఐ నాయకులు ప్రభు,నయిమ్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *