పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం దోమ మండల పరిధిలోని మైలారం గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.మైలారం యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కిష్టపురం అశోక్,వర్కింగ్ ప్రెసిడెంట్ విస్లావత్ విజయ్,జనరల్ సెక్రెటరీ మల్కాపురం వెంకటేష్,ఉపాధ్యక్షులుగా మాటూరి హనుమంతు,సోషల్ మీడియా కన్వీనర్ గా మూడవత్ రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శాంత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాములు నాయక్ ,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ , గ్రామ కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్, రత్నయ్య, యువ జన కాంగ్రెస్ మండల కార్యదర్శి మహేష్, వెంకటయ్య, మటురి నర్సింలు పాల్గొన్నారు..
మైలారం గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక



