లక్ష రూపాయల సాయంతో మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ప్రకటించడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన పథకం మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని మైనార్టీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



