మేరీ మట్టి –  మేరా దేశ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 : భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా  “ఆజాది కా అమృత్ మహోత్సవ్” ముగింపు వేడుకల సదర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మేరీ మట్టి – మేరా దేశ్” కార్యక్రమాన్ని కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్షీనర్సింహ్మ రెడ్డి (ఎల్ ఎన్ రెడ్డి) ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నా దేశం నా మట్టి అనే భావన కలగాలని, దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేశ చరిత్రను మరియు సాధించిన ఘనతను తెలుసుకోవాలని, దేశం కోసం జీవితాలను పణంగా పెట్టి అమరులైన వీరులను ప్రతి గ్రామం స్మరించుకోవాలని ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల నుండి మట్టిని పంపడం, తద్వార కేంద్ర ప్రభుత్వం ఈ మట్టితో “అమృత వాటిక” ( మొక్కలు పెంచే వేదికను) ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ పరిధిలో  4-5 నివాస గృహాల నుండి మరియు చారిత్రాత్మక ప్రదేశాల నుండి మట్టిని సేకరించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు పంపించనున్నట్లు తెలిపారు. గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలిగించుటకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ, ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దుటకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డి ఆర్ డి ఓ పి డి ప్రభాకర్, ఏపీడి సక్రియా, ఏపిఎం రాజేశ్వరి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు మల్లయ్య, మహేష్, వివో లు లావణ్య, శైలజ, వనిత, నాయకులు జహాంగీర్ అలీ, సత్యం, రాంచందర్ నాయక్, మహేష్, శ్రీను, పంచాయితీ కార్యదర్శి రాఘవేందర్, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *