ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండాలో ముత్యాలమ్మ దేవతకు తాండ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముత్యాలమ్మకు నూతన ఆలయం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నవధాన్యాలను పోసి.. నూతన గోపురాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబర్ సింగ్, లక్ష్మణ్ నాయక్, ఎల్ఐసి పాండు నాయక్, శంకర్ నాయక్, మల్యా నాయక్, పీరియా, సీతారాం, పురుషోత్తం, భాస్కర్, రాజా, కుమార్, తౌరియా నాయక్, శ్రీను నాయక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేడిగడ్డలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు





