మేఘాలయ మేనిఫెస్టో విడుదల చేసిన బిజెపి జాతీయ చీఫ్‌ ‌నడ్డా

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 15 : మేఘాలయ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేఘాలయలో 7వ పే కమిషన్‌ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చూస్తామని హా ఇచ్చారు. పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని ఏటా రూ. 2000 పెంచాలని తాము నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఆడపిల్ల పుడితే రూ.50,000 బాండ్‌ ఇస్తామన్న ఆయన.. బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తా మని హా ఇచ్చారు. వితం తువులు, ఒంటరి మహిళల సాధి కారత కోసం ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఉజ్వల పథకం లబ్దిదా రులకు ఏటా రెండు ఎల్‌పీజీ గ్యాస్‌ ‌సిలిండర్లు అంది స్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగను ండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *