మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 :  కడ్తాల మండలంలోని మక్త మధారము గ్రామంలో మృతి చెందిన ఆమంచ లింగం అంబానీ కుటుంబాన్ని జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి రూ. 5వేలు అందజేశారు. అదేవిధంగా సిరిగిరి రవిందర్  కుటుంబలను పరమర్శించి రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు, లింగం రైతుబీమా ఎందుకు ఆలస్యం అయిందో వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 5వేల చొప్పున రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, మండల  రైతు కో-ఆర్డినేటర్ వీరయ్య,   ఎంపిటిసిలు, బండి మంజుల చంద్రమౌళి, ప్రియా రమేష్  సర్పంచ్ సులోచన సాయిలు, హరిచంద్ నాయక్, ఉపసర్పంచ్ బండి గణేష్, వార్డ్ సభ్యులు జనిల్,  పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ సువలి పంతు నాయక్, గ్రామ పార్టీ నాయకులు అర్కోటం చెన్నయ్య, కృష్ణయ్య, కట్ల మల్లేష్, మార్ల మల్లేష్, శ్రీకాంత్, నరేందర్, రాజు, యాదగిరి, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *