మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని అలిరాజపేట గ్రామంలో శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల లచ్చమ్మ (80) కుటుంబ సభ్యులను మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మండల రజక సంఘం తరపున రూ.5000లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గ రజక అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ మాట్లాడుతూ సమాజంలో  బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. గత మూడు సంవత్సరాల నుంచి జగదేవ్ పూర్ మండలంలో రజక సమాజికవర్గంలోని బాదిత  కుటుంబాలను ఆదుకోవడంలో మండల రజక సంఘం నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దీనిని స్పూర్తిగా తీసుకొని ఆయా సమాజికవర్గాలకు చెందిన నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో  మండల రజక సంఘం  అద్యక్షుడు అక్కారం నర్సింలు ఉపాధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్ రాచకొండ యాదగిరి కోశాధికారి రాచకొండ బాల్ నర్సయ్య అలిరాజపేట గ్రామ రాచమల్ల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల నర్సింలు సభ్యులు రాచమల్ల ఆంజనేయులు యాదగిరి నర్సింలు కనకయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *