మూడోటెస్టులో టీమిండియా పరాజయం

  • 9 వికెట్ల తేడాతో ఓటమి చెందిన రోహిత్‌ ‌సేన
  • వికెట్‌ ‌కోల్పోయి 78 రన్స్ ‌చేసిన ఆస్టేల్రియా
  • నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్‌

ఇం‌డోర్‌,‌మార్చి3 : అనుకున్నట్లుగానే మూడో టెస్టు మూడు రోజులకే ముగిసింది. అద్భుతాలు ఏం జరగలేదు. బోర్డర్‌ ‌గవాస్కర్‌ ‌ట్రోఫీ మూడో టెస్టులో ఆస్టేల్రియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 76 పరుగుల చిన్న టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ ‌జట్టు 78 రన్స్ ‌చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ ‌ఖవాజా వికెట్‌ ‌మాత్రమే భారత బౌలర్లు తీయగలిగారు. అయితే..తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్‌ (28), ‌ట్రావిస్‌ ‌హెడ్‌ (49) ‌పరుగులతో కాస్త దూకుడుగా ఆడారు. వీరిద్దరు నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. భారత్‌ ‌స్పిన్న ర్లు ఏమైనా అద్భుతం చేస్తారని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-1 ఆధిక్యంలో భారత్‌ ‌కొనసాగుతోంది. అంతకు ముందు టాస్‌ ‌గెలిచి బ్యాటింగ్‌ ‌కు దిగిన భారత్‌ ‌జట్టు తొలి ఇన్నింగ్స్ ‌లో 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ అనుకున్న విధంగా ఆడకలేకపోయారు.

ఆసీస్‌ ‌బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్‌ ‌బౌలర్లలో కునేమన్‌ 5 ‌వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌?‌ను దెబ్బతీశాడు. ఇక..తర్వాత తొలి ఇన్నింగ్స్ ‌ప్రారంభించిన ఆస్టేల్రియా జట్టు..76.3 ఓవర్లలో 197 పరుగులు చేసింది. ఖవాజా 60 రన్స్ ‌చేయడంతో ఆస్టేల్రియా జట్టు ఆ మాత్రం స్కోర్‌ ‌చేయగలిగింది. భారత్‌ ‌బౌలర్లలో జడేజా తన మాయాజలాన్ని మరోసారి నిరూపించి 4 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌ 3, ఉమేష్‌ 3 ‌వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్టేల్రియా 87 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
అనంతరం సెకండ్‌ ఇన్నింగ్స్ ‌ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్‌ ‌తగిలింది. ఆసీస్‌ ‌బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్‌ ‌బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. స్పిన్నర్‌ ‌నాథన్‌ ‌లియోన్‌ (8/64) ‌ధాటికి భారత్‌ ‌బ్యాటర్లు పెవిలియన్‌ ‌బాట పట్టక తప్పలేదు. ఓపెనర్‌ ‌రోహిత్‌ (12), ‌గిల్‌ (5) ‌వెంటనే అవుటయ్యాక.. క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. దీంతో భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్ ‌కంటే దారుణంగా బ్యాటింగ్‌ ఆరంభించింది. వికెట్లు పడుతున్న క్రమంలో పుజారా జట్టుకు అండగా నిలిచి 142 బంతుల్లో 59 రన్స్ ‌చేసి టీమిండియాను ఆదుకున్నాడు. జడేజా, కోహ్లీ, అయ్యర్‌, ‌కీపర్‌ ‌భరత్‌?‌లు కూడా నిరాశపరిచారు. దీంతో సెకండ్‌ ఇన్నింగ్స్?‌లో భారత్‌ 60.3 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *