ములాయం స్మారకం వద్ద అఖిలేశ్‌, ‌డింపుల్‌ ‌నివాళి

ములాయం స్మారకం వద్ద అఖిలేశ్‌, ‌డింపుల్‌ ‌నివాళి

‌లక్నో, నవంబర్‌ 14 : ‌సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్‌ ‌యాదవ్‌, ‌పార్టీ అధినేత అఖిలేష్‌ ‌యాదవ్‌… ‌పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్‌ ‌యాదవ్‌కు ఇటావాలోని సైఫాయ్‌లోని ఆయన స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. క ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురీ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ములాయం కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌సతీమణి డింపుల్‌ ‌యాదవ్‌ ‌బరిలోకి దిగనున్నారు.

వాస్తవానికి ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ములాయం మనవడు, మాజీ ఎంపీ తేజ్‌ ‌ప్రతాప్‌ ‌యాదవ్‌ను పోటీలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ, చివరకు డింపుల్‌ ‌యాదవ్‌ను ఖరారు చేశారు. మెయిన్‌పురి అసెంబ్లీ ఉప ఎన్నికకు డింపుల్‌ ‌యాదవ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌కు డింపుల్‌ ‌యాదవ్‌, అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌పుష్పాంజలి ఘటించారు. డిసెంబర్‌ 5 ‌న ఈ ఉప ఎన్నిక జరగనుండగా.. అదే నెల 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *