ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపధ్యక్షునిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజ్ నియమించగ సిద్దిపేటలో నిర్వహించిన ముదిరాజ్ సమావేశంలో నియామక పత్రాని జంగిటి శ్రీనివాస్ కు ఇస్తూ షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా జంగిటి శుక్రవారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ముదిరాజుల హక్కుల కోసం అందరిని ఏకం చేస్తూ పోరాడుతానని ముక్యంగా ముదిరాజ్ లను బి.సి డి నుండి బి.సి ఏ లోకి మార్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నామని మా డిమాండ్ ను పెడచెవిన పెడుతున్నారని అన్నారు.ప్రస్తుతం ఎన్నికలు ఉన్నంద్దున మా డిమాండ్ నెరవేర్చే పార్టీకి మాత్రమే ఓటు వేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానం చేస్తామని అన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజ్ కు సహకరించిన తుపాకుల బాల్ రంగం, మల్యాల బాల్ రాజ్, మేడికాయల వెంకటేశం లకు కృతజ్ఞతలు చెప్పారు ఆయనతో పిట్ల నాగార్జున, సందిల కరుణాకర్ బొట్టు శీను ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *