ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: సీఎం కెసిఆర్ ముచ్చటగా మూడోసారి బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వారి స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ భారత దేశం తో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్న తరుణంలో రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసి ముచ్చటగా మూడోసారి బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని అన్నారు. మెదక్ లో నిర్వహించిన బహిరంగ సభలో లక్షకు పైగా ప్రజలు హాజరయ్యారని సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే ప్రభుత్వం బిఆర్ ఎస్ ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యే అభ్యర్థులు కరువయ్యారని, దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి మొదటి బహిరంగ సభ విజయవంతం అయ్యిందని సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ నుండి లక్ష కు పైగా మెజార్టీ తో సీఎం కెసిఆర్ గెలుపు తప్పదని అన్నారు. ఇటీవల మంత్రి హరీష్ రావు మీద మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మంత్రి హరీష్ రావు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *