ముగిసిన మోదీ ధ్యాన ముద్ర

  • తిరువళ్లూరు విగ్రహం వద్ద నివాళి
  • దిల్లీకి తిరుగు ప్రయాణం

కన్యాకుమారి, జూన్‌ 1 : తమిళనాడులోని కన్యాకుమా రిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు.   ధ్యానం ముగిసిన అనంతరం ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ విగ్రహానికి మోదీ పూలమాల వేసి, నివాళులర్పించారు. వివేకానంద శిలాస్మారకం పక్కనే చిన్న దీవిపై ఏర్పాటుచేసిన 133 అడుగుల ఎత్తయిన ఈ భారీ విగ్రహం వద్దకు ఆయన పడవలో చేరుకున్నారు.

అనంతరం కన్యాకుమారి తీరానికి తిరిగివచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్‌ నుంచి వెనుదిరిగిన మోదీ.. తమిళనాడులోని భగవతి అమ్మన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శిలాస్మారకాన్ని చేరుకుని, ధ్యాన పక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. 2019లో ఎన్నికల సమయంలో మోదీ కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *