ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31: మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయి రెడ్డి కి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రూ.62,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి సోమవారం బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమంగల్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, మంగళపల్లి మాజీ ఉపసర్పంచ్ మురళి, గ్రామ కమిటీ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, యాదయ్య, నరసింహ, సోలేటినరసిరెడ్డి, వెంకటేష్, తానయ్య, రాజేష్, శివ, హర్ష రెడ్డి పాల్గొన్నారు.




