ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల పక్షపాతి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూసే పేదల మనిషి అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారని, ఈ విషయ ంలో అనేక పథకాలు రూపొం దించి వాటిని విజయవంతంగా కొనసాగి ంచడం జరుగుతోం దని, పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని  రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ‌సమావేశ మందిర ంలో మేడ్చల్‌ ‌నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకంకు చెందిన  ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ సందర్బ •ంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఒక ప్రణాళికబద్దంగా ఆయా కార్యక్ర మాలు చేపట్టి వాటిని విజయప థంలో దూసు కెళ్ళేలా చేయడం జరుగు తోందన్నారు. అలాగే గృహలక్ష్మీ పథకం కింద దరఖాస్తులు చేసుకొన్న వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని మరో విడతలో వారికి కూడా వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌లు, గృహలక్ష్మీ పథకం కింద రూ.3 లక్షలు అందచేయడం జరుగుతుందని, ఈ విషయ ంలో ఎలాంటి నిరాశకు గురికావద్దని తెలిపారు.
దీంతో పాటు మేడ్చల్‌ ‌నియోజ కవర్గంలో 26 వేల డబుల్‌ ‌బెడ్రూమ్లు ఉన్నాయని అందులో పది శాతం స్థానికులకు అందేలా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మేడ్చల్‌ ‌నియోజక వర్గంలో చేపడుతన్న కార్యక్ర మాలన్నీ విజయవం తమవుతు న్నాయని ఇది ఎంతో సంతోషకరమని ఈ విషయంలో అధికా రులు, ప్రజా ప్రతినిధులు సహకారం వల్ల సాధ్యమ వుతుందని వారిని అభినం దించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రతి ఒక్కరినీ ధనవంతులను చేయా లనే మంచి సంకల్పంతో దళిత బంధు, గృహలక్ష్మీ, బీసీబం ధుతో పాటు అనేక రకాల పథకాలతో పేదల అభ్యు న్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు, బీసీ బంధు పథకం ద్వారా తన చేతుల మీదుగా లబ్ధిదా రులకు అందచేయడం జరిగింద న్నారు. ప్రసు్త తం గృహలక్ష్మీ పథకం కింద మొదటి విడతగా మూడువేల మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందని, వీటితో పాటు ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీము బారక్‌, ‌రైతుబంధు వంటి పథకాలు సైతం నిరంతర ప్రక్రియగా కొనసా గుతున్నా యని వివరి ంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అదనపు కలెక్టర్‌ ‌విజయేందర్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి, ప్రజాప్రతినిధులు, లబ్ధి దారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *