మీర్ఖాన్ పేట్ నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 25 : మండల పరిధిలోని మీర్ఖాన్ పేట్ గ్రామంలో అయ్యప్ప స్వాములు బుధవారం చంద్రమోహన్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో కాకి నవీన్ కుమార్,జక్కుల శివ,పంతం జంగయ్య స్వాములు ఈరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు.గ్రామంలో అయ్యప్ప శరను గోషలతో మారు మోగింది.ఈ సందర్భంగా  ఈమహేశ్వరం నియోజకవర్గం ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ పాల్గొని ప్రజలు భక్తిశ్రద్ధలను అలవర్చుకొని మంచి మార్గంలో నడవాలని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీటీసీ కాకి రాములు ముదిరాజ్,కాకి శంకర్,శ్రీశైలం యాదవ్,బొమ్మరాజు  యాదయ్య,ఆలూరి శివ,కాసోజి శివ,కాకి సంతోష్ కుమార్,బాలకృష్ణ,రాజు,యశ్వంత్, శివ,రమేష్,రాము,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *