మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బిజెపి ప్లాన్‌

  • కార్నర్‌ ‌వి•టింగ్‌లతో ప్రజల్లోకి
  • 25 నుంచి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నియోజకవర్గాల పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. పక్కా వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, కేసీఆర్‌ ‌వైఫల్యాలను నిలదీయడంతో పాటు అధికారంలోకి వొస్తే ఏం చేస్తామన్న అంశాలను వివరిస్తూ కార్నర్‌ ‌వి•టింగ్‌ ‌నిర్వహిస్తుంది. శుక్రవారం నుంచి పలు ప్రాంతాల్లో ఆయా నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ఈ ‌నెల 25 నుంచి నియోజకవర్గాల పర్యటనలకు సిద్ధమయ్యారు. పార్టీ జాతీయ స్థాయి నేతలతో ఒక్కో నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్‌ ‌చేస్తున్నారు.

ఈ నెల 25 నాటికి బీజేపీ చేపట్టిన 11 వేల కార్నర్‌ ‌వి•టింగ్స్ ‌పూర్తి కానున్నాయి. ఆ వెంటనే నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్‌ ‌రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి బండి సంజయ్‌ ఇప్పటికే పార్టీ హైకమాండ్‌ ‌పర్మిషన్‌ ‌తీసుకున్నారు. నియోజకవర్గాల పర్యటన అనంతరం ఉమ్మడి 10 జిల్లాల్లో బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. ఈ పబ్లిక్‌ ‌వి•టింగ్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ ‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *