మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  ప్రశాంత వాతావరణంలో మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ర్యాలీని ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ శాంతియుతంగా జరుపుకోవాలని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం కోరారు. శనివారం ఆమనగల్లు ఎస్సై బలరాం  ఆధ్వర్యంలో ఆమనగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముస్లిం పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ర్యాలీ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను పోలీసులకు వివరించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు. ఈనెల 28న నిర్వహించే మిలాద్ ఉన్ నబీ ర్యాలీని గణేష్ నిమజ్జనం సందర్భంగా వాయిదా వేసుకుంటున్నట్లు ముస్లిం పెద్దలు ప్రకటించారు.  అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబి ర్యాలీనీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వారు తెలిపారు.  ర్యాలీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *