- మణిపూర్‌పై తక్షణమే చర్చించండి
- కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్
న్యూదిల్లీ,జూలై21 : ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం విరుచుకుపడ్డారు. మణిపూర్, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మణిపూర్ వీడియో నిజంగా ప్రధానికి ఆగ్రహం తెప్పించిందా అని వ్యంగ్యంగా విమర్శించారు. కు నిజంగా ఆగ్రహం వొచ్చివుంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల అసమానత్వం చూపకుండా.. మణిపూర్ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి ఉండేవారని ట్వీట్ చేశారు. ఈ ప్రకటన కేవలం ఒక ఘటనకు మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. 80 రోజుల పాటు మణిపూర్ మండిపోతున్నా.. రాష్ట్రంలో, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు పూర్తిగా నిస్సహాయంగా ,నిర్దయగా వ్యవహరిస్తున్నాయని ఖర్గే అన్నారు. గురువారం ఉదయం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మణిపూర్‌పై డియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాధించిందని అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.
మణిపూర్‌లో రెండున్నర నెలల నుంచి జరుగుతున్న హింసాకాండపై పార్లమెంటులో సవివరంగా మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని, కాంగ్రెస్ పాలిత రాష్టాల్ల్రోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని అన్నారు. మెయిటీలు, కుకీల మధ్య మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయట పడింది. దీనిపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది.
ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. మే 18న పోలీసులకు ఫిర్యాదు అందిందని, దీనిపై జూన్ 21న ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు. ఖర్గే శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటులో గురువారం రు ప్రకటన చేయలేదు. కు కోపం వస్తే, మొదట రు మణిపూర్ ముఖ్యమంత్రిని డిస్మిస్ చేసి ఉండేవారు. కేవలం ఒక సంఘటన గురించి కాకుండా, పశ్చాత్తాపం లేకుండా, పూర్తి నిస్సహాయతతో చూస్తూ, కేంద్ర, రాష్ట్రాల్ల్రోని ప్రభుత్వాలు 80 రోజులపాటు నిర్వహించిన హింసపై రు పార్లమెంటులో వివరంగా మాట్లాడాలని ఇండియా ఆశిస్తుందని తెలిపారు.



