మిట్టపల్లి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకుండా పరిరక్షించాల్సిన సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారని డెవలప్మెంట్ పేరు మీద వైస్ చైర్మన్ రమణాచారి వీరిద్దరూ కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. సిద్దిపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామంలోని పలు సర్వేనెంబర్లలో ప్రభుత్వ భూమి ఉందని దాదాపు 30 ఎకరాలకు పైగా అట్టి భూమిని సుడ మాజీ చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని అన్నారు. 30 ఎకరాలు కబ్జాపై అర్బన్ తాసిల్దార్ పై కూడా విచారణ జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని అన్నారు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ పేరు మీద సుడా వైస్ చైర్మన్ రమణాచారి వివిధ పనుల నిమిత్తం లక్షల రూపాయలు సొమ్ము కాజేశారని ఆరోపించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అధికారులు పాలకులు దోచుకో దాచుకో అన్నట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎవరి అబ్బా జాగీర్ అని స్థలాలు కబ్జా ప్రజల నిధులను కాజేస్తారని మండిపడ్డారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధార తమ వద్ద ఉన్నాయని పూర్తి ఆధారాలను బయటపెట్టి ప్రభుత్వానికి అప్పగిస్తానని హెచ్చరించారు. అవినీతికి పాల్పడ్డ మా రెడ్డి రవీందర్ రెడ్డి రమణాచారి అర్బన్ తహాసిల్దార్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు చేపట్టేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ప్రజల సొమ్మును కాజేసిన వీరు ప్రజల సమక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు మజార్ మాలిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదరీ మధు, పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్, నజ్జూ,నవాజ్, యాదగిరి, ప్రశాంత్, ఫయాజ్ నాని, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *