మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్ల హతం

రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : ఛత్తీస్‌గఢ్‌ ‌సుక్మా జిల్లా జగర్‌గుండా పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని కుందేడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అమరులైన జవాన్లను ఏఎస్‌ఐ ‌రామ్‌నాగ్‌, ‌కానిస్టేబుల్‌ ‌కుంజమ్‌ ‌జోగా, వంజం భీమాగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎదురుకాల్పులు జరిగిన సప ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం బలగాల కూంబింగ్‌ ‌కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *