మార్వాడిల సమస్యల పరిష్కారాన్ని కృషి: బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:   మార్వాడి ల సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి  హైదారాబాద్ మల్కారామ్ ఐమాత అమ్మవారి మందిరం గౌశాలలో పూజ , భజన ప్రధమ వార్షికోత్సవ   కార్యక్రమానికి     బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ,మార్వాడి సంఘం అధ్యక్షుడు కైలాష్ శర్మ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మందిర కమిటీ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, ప్రభుదాస్ , కైలాష్ శర్మ ల ను మర్వాడి పాగ, పూలమాల , శాలువాలతో ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మార్వాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని , వారికి ఎల్లవేళలా అండగా ఉండి సేవలు అందిస్తానని  అన్నారు.ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులతో పాటు మార్వాడి సంఘం సెక్రటరీ డగ్లారాం, మంగ్లారాం, నారాయణ్ లాల్ పరిహార్, కాలురాం కాగ్, హుకమారాం,  దయారాం, రాజుసిర్వి, అనిల్ జైన్  మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *