మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలల ఆర్జిత సేవల కోటా

నేటి సాయంత్రం విడుదల చేయనున్న టిటిడి
తిరుమల, ఫిబ్రవరి 21 : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలలకు సంబంధించి బుధవారం 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌ ‌లైన్‌ ‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నట్టు తెలిపింది.

దాంతో పాటు ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌ ‌లైన్‌ ‌లక్కీ డిప్‌ ‌నమోదు పక్రియ ఫిబ్రవరి 22 ఉదయం 10గంటల నుంచి ఫిబ్రవరి 24న ఉదయం 10గంటల వరకు ఉంటుందని టీటీడీ పేర్కొంది.ఈ లక్కీడిప్‌ ‌లో టికెట్లు పొందిన వారు నగదు చెల్లించి టికెట్‌ ‌ను ఖరారు చేసుకోవాలని సూచించింది. భక్తులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆర్జిత సేవలను బుక్‌ ‌చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *