చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి 25శాతం సీట్లు కేటాయించాలని టిఎస్ ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కట్కూరి పర్శరాములు కోరారు. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరుగబోయే మాదిగల యుద్ధభేరి సభ కరపత్రాన్ని చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. డప్పు, చెప్పు వృత్తిదారులకు రూ.4వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. 10సంవత్సరాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయినుంచి మాదిగలు లక్షలాదిగా యుధ్ధభేరి బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిన్నకోడూరు మండల అధ్యక్షుడు ఎస్ కనకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్యం, ఉపాధ్యక్షుడు మొండయ్య, ప్రధాన కార్యదర్శి రవి, నాయకులు శ్రీకాంత్, దశరథం, లింగం, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
మాదిగల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి




