- మేమెవరికీ బి..సి టీమ్లము కాము
- స్కాముల కాంగ్రెస్ విమర్శల్లో అర్థం లేదు
- ట్విట్టర్ వేదికగా ఖమ్మంలో రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : ‘మాది బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్కు సీ టీమ్ అంతకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. వి•దే భారత రాబందుల పార్టీ అని కాంగ్రెస్ను ఉద్దేశించి అన్నారు. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని మంత్రి అన్నారు. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అని చెప్పారు. ‘స్కాములే తాచుపాములై..వి• యూపీఏను, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు. మా పార్టీ బీజేపీకి..బీ టీమ్ కాదు. కాంగ్రెస్ పార్టీకి..సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటినీ ఒంటిచేత్తో ఢీ కొట్టే.. ఢీ టీమ్ అన్నారు.
బీఆర్ఎస్ను నేరుగా ఢీ కొట్టే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా..? ఈ మిస్ ఫైరింగ్లో ముమ్మారిటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే’ అని కెటిఆర్ అన్నారు. తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ బీఆర్ఎస్. బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ కాంగ్రెస్. కారు స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలో పదిలం. కానీ, కాంగ్రెస్ పైనే రాహుల్కు కంట్రోల్ తప్పింది. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండామునిగిన పార్టీ కాంగ్రెస్. ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్…అని కెటిఆర్ అన్నారు. లక్ష కోట్ల వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా..? అర్థం లేని ఆరోపణలు చేసి.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు. తెలంగాణ ప్రజలు కోరుతుంది నిర్మాణాత్మక ప్రతిపక్షం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి..మళ్లీ దలారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.
కర్ణాటకలో ‘అన్నభాగ్య’ హావి•ని గంగలో కలిపి ఇక్కడ రూ.4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు..? ఎన్నికల్లో హావి• ఇచ్చిన రేషన్ ఇవ్వలేని వాళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే నమ్మేదెవరు..? కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు. మరో ప్రత్యామ్నాయం లేక ఆ ఫలితం తప్ప అది వి• ఘనత కాదు. సమర్థత అంతకన్నా కాదు’ అని కేటీఆర్ అన్నారు. సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోండి అని సూచించారు. 4.6 లక్షల ఎకరాలు పంచి ఆడబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్ జంగల్ జవి•న్ అనే మన్యం వీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు.. బీఆర్ఎస్ పార్టీ పాలనలో మన్యానికి మంచిరోజులు అని అన్నారు. మా తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం. కుమ్ములాటల కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ కల్లోలమే. ఇది చైతన్యానికి ప్రతీకైన.. తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజం. బీఆర్ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు..? జాతీయ రాజకీయాలు వి• జాగీరా..? వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ అంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.




